ఖమ్మం జిల్లా చరిత్ర

జిల్లా చరిత్ర : పేలియోలిథిక్ కాలానికి చెందిన మానవుడు ఇక్కడ లోయర్ గోదావరి లోయ (భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, పాల్వంచ) ప్రాంతాల్లో సంచరించినట్లు ఆధారాలున్నాయి. కొండపైన నిర్మించిన నర్సింహాద్రి గుడిని స్థంభశిఖర అని పిలిచే వారు. అది క్రమేణా స్థంభాద్రిగా తర్వాత కంభంగా, కంభమెట్టుగా, కమ్మమెట్టుగా చివరికి ఖమ్మంగా స్థిరపడింది.

* సరిహద్దు జిల్లాలు : సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కృష్ణా, పశ్చిమగోదావరి (అంధ్రప్రదేశ్)

* విస్తీర్ణం : 4481.17 చ.కి.మీ

* పరిపాలన కేంద్రం : ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ - ఖమ్మం

దర్శనీయ ప్రదేశాలు :

* స్థంభాద్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవాలయం (ఖమ్మం), కూసుమంచి శివాలయం

* దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దది అయిన బౌద్ధ స్థూపం - నేలకొండపల్లి

* ఖమ్మం ఖిల్లా, వేణుగోపాలస్వామి దేవాలయం - కూసుమంచి

* అతి పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం జమలాపురం

* గణపేశ్వరాలయం - కూసుమంచి, ముక్కంటేశ్వరాలయం