ఆధునిక భారతదేశ చరిత్ర - I
1. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు-
జవాబు: 1942 ఆగస్టు 9
2. ''డు ఆర్ డై'' అనే నినాదాన్ని ఇచ్చింది-
జవాబు: మహాత్మాగాంధీ
3. క్యాబినెట్ మిషన్ సభ్యులు కానిది-
జవాబు: పి.సి.అలెగ్జాండర్
4. కిందివాటిలో మొదటి సంఘటన-
1) రాజాజీ ఫార్ములా 2) వేవెల్ ప్రణాళిక 3) క్యాబినెట్ మిషన్ 4) మౌంట్‌బాటన్ ప్రణాళిక
జవాబు: రాజాజీ ఫార్ములా
5. ''నడిరేయి సమయంలో ప్రపంచమంతా నిద్రావస్థలో ఉన్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితానికి మేల్కొంటుంది'' అని భారత స్వాతంత్య్రంపై వ్యాఖ్యానించింది-
జవాబు: నెహ్రూ
6. ముస్లింలీగ్ ప్రత్యక్ష చర్యాదినం చేపట్టిన రోజు-
జవాబు: 1946 ఆగస్టు 16
7. జాతీయోద్యమంలో హిందూ-ముస్లిం అలజడులు ఏ సంఘటనతో ప్రజ్వరిల్లాయి?
జవాబు: ప్రత్యక్ష చర్యాదినం
8. దేశ విభజనకు ప్రధాన కారణం-
జవాబు: జిన్నా అనుసరించిన ప్రత్యక్ష చర్యాదినం మొదలైన విధానాలు
9. స్వదేశీ సంస్థానాల శాఖా కార్యదర్శి-
జవాబు: వి.పి.మీనన్
10. స్వదేశీ సంస్థానాలను ఎన్ని తరగతి రాష్ట్రాలుగా రూపొందించారు?
జవాబు: 4
11. సర్దార్ వల్లభాయ్ పటేల్ 'ఇండియన్ బిస్మార్క్' బిరుదు పొందడానికి కారణం-
జవాబు: స్వదేశీ సంస్థానాలను ఇండియాలో చేర్చడం
12. ''దేహంలోని ఒక అవయవం విషపూరితమైతే అది మిగిలిన అవయవాలకు వ్యాపిస్తుందనే భయంతో దానిని త్వరితంగా తీసివేయాలి. లేకపోతే ఆ దేహాన్ని బాగుచేయడం దుర్లభం'' అని చెప్పింది-
జవాబు: వల్లభాయ్ పటేల్
13. దీనబంధు బిరుదు ఎవరికుంది?
జవాబు: సి.ఎఫ్.ఆండ్రూస్
14. 1946 సెప్టెంబరులో ఏర్పాటయిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసింది-
జవాబు: లియాఖత్ ఆలీఖాన్
15. 1947 అట్లీ ప్రకటన ప్రకారం బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఎప్పటిలోగా వదలివెళతామని చెప్పారు?
జవాబు: 1948 జూన్
16. అఖండ భారతదేశాన్ని భారత్, పాకిస్థాన్‌లుగా విభజిస్తామని ఎందులో పేర్కొన్నారు?
జవాబు: మౌంట్‌బాటన్ పథకం
17. బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
జవాబు: 1946
18. రాయల్ ఇండియన్ నేవీ నౌకాదళ తిరుగుబాటులో సిపాయిలకు, బ్రిటిష్‌వారికి మధ్యవర్తిగా రాయబారం వహించింది-
జవాబు: మహ్మద్ ఆలీజిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్
19. 1947 సంవత్సరానికి సంబంధించని సంఘటన-
జవాబు: క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియా రాక
20. కింది సంఘటనలలో చివరిది?
స్వరాజ్య పార్టీ ఏర్పాటు, చౌరీ చౌరా సంఘటన
జవాబు: స్వరాజ్య పార్టీ ఏర్పాటు
21. 1937లో 11 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ముస్లింలీగ్ ఎన్ని రాష్ట్రాల్లో అధికారం నెలకొల్పింది?
జవాబు: 2
22. కిందివాటిలో చివరి సంఘటన-
పూనా ఒడంబడిక, కమ్యునల్ అవార్డు
జవాబు: పూనా ఒడంబడిక
23. ఈస్ట్ఇండియా కంపెనీ పరిపాలన రద్దుకు విక్టోరియా రాణి ప్రకటన ఎప్పుడు వెలువడింది?
జవాబు: 1858 నవంబరు 1
24. ఇండియాలో మొదటి జనాభా లెక్కల సేకరణ చేసింది ఎవరు?
జవాబు: లార్డ్ మేయో
25. వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం (ప్రాంతీయ భాషా పత్రికల) రద్దుచేసింది-
జవాబు: లార్డ్ రిప్పన్
26. లార్డ్ చెమ్స్‌ఫర్డ్ కాలంలో జరిగిన ప్రధాన సంఘటన-
జవాబు: జలియన్‌వాలాబాగ్ సంఘటన
27. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిష్ ఇండియా వైస్రాయ్-
జవాబు: లార్డ్ వెల్లింగ్‌టన్
28. నరబలులను నిషేధించింది-
జవాబు: హార్డింజ్-1
29. పత్రికలమీద నిషేధాన్ని ఎత్తివేసి పత్రికాస్వేచ్ఛ కల్పించింది-
జవాబు: చార్లెస్ మెట్‌కాఫ్
30. కారన్‌వాలీస్‌కు సంబంధించిన సంఘటన-
జవాబు: శాశ్వత భూమిశిస్తు విధాన ప్రవేశకర్త
31. భారతదేశంలో మొదటి వార్తా పత్రిక-
జవాబు: బెంగాల్‌గెజిట్
32. సమాచార్ దర్పణ్ వ్యవస్థాపకులు-
జవాబు: విలియం కార్వే
33. బంగదూత పత్రిక ఎన్ని భాషల్లో వెలువడింది?
జవాబు: 4
34. దాదాబాయి నౌరోజి స్థాపించిన పత్రిక-
జవాబు: రస్త్ గోప్తర్
42. మహారాష్ట్రకు సంబంధించిన కుల ఉద్యమం-
జవాబు: మహర్
43. బి.ఆర్.అంబేద్కర్ నాయకత్వం వహించిన కుల ఉద్యమం-
జవాబు: మహర్
44. ఆత్మగౌరవ ఉద్యమ ప్రారంభకులు-
జవాబు: ఇ.వి.రామస్వామినాయర్
45. 'జస్టిస్‌పార్టీ' ఉద్యమ ప్రారంభంతో సంబంధంలేనివారు-
జవాబు: టి.కె.మాధవన్
46. మొదటి ఫ్యాక్టరీ చట్టం ఎవరికాలంలో రూపొందింది?
జవాబు: లార్డ్ రిప్పన్
47. భారతదేశంలో మొదటి కార్మిక సంఘం మద్రాస్ లేబర్ యూనియన్ స్థాపకులు-
జవాబు: బి.పి.వాడియం
48. అఖిల భారత కార్మిక కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి) తొలి అధ్యక్షుడు-
జవాబు: లాలలజపతిరాయ్