అటల్ పెన్షన్ యోజన

అటల్ పెన్షన్ యోజన 



వృద్ధాప్యంలో ఎవరూ కూడా తమ కనీస జీవనావసరాల నిమిత్తం ఇతరులపై ఆధారపడకుండా నెలనెలా పింఛను రూపంలో కొంత మొత్తాన్ని పొంది గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో భారతప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం అటల్ పెన్షన్ యోజన.

ఈ పథకం జూన్ 1, 2015న ప్రారంభమైనది. ఈ పథకం కింద పాలసీ తీసుకున్నట్లయితే 60 సంవత్సరాల నుండి నెలనెలా రూ.1,000/- ల నుండి రూ.5,000/- ల వరకూ పింఛను పొందవచ్చు.

| అర్హత


  • బ్యాంకు పొదుపు ఖాతా కలిగిన ప్రతిఒక్కరూ ఈ పథకంలో చేరవచ్చు.
  • 18 సంవత్సరాలనుండి 40 సంవత్సరాల వయసు కలిగిన ప్రతిఒక్కరూ అర్హులే.
  • గత ఎన్.పి.ఎస్. లైట్ పథకంలోని పాలసీదారులుకూడా ఈ కొత్తపథకంలో చేరవచ్చు.

| ఖాతాను తెరిచే విధానం


  • బ్యాంకు ప్రతినిధిని లేదా బ్యాంకు మిత్రను కలిసి సంబంధిత ఫారంను, రిజిస్ట్రేషను ఫారంను పూర్తి చేయాలి.
  • ఫారంలో అడిగిన అన్ని వివరాలూ తప్పనిసరిగా తెలియజేయాలి. (మొబైల్ నంబరు, ఆధార్ నంబరుతో సహా)
  • వయసును బట్టి ఎంత 'కిస్తీ' కట్టాలో (కాంట్రిబ్యూషను) బ్యాంకు నిర్ధారిస్తుంది.
  • ఇంతకు ముందు బ్యాంకు ఖాతా లేనట్లయితే, ఇప్పుడు బ్యాంకు ఖాతా మరియు అటల్ పింఛన్ యోజన పథకం ప్రారంభించవచ్చు.
  •  బ్యాంకు ఖాతా తెరిచేటపుడు 'నీ వినియోగదారుని గురించి తెలుసుకో.' (కె.వై.సి.) నిబంధనలను అనుసరించాలి.
  • మీరు డిపాజిట్ చేసిన మొత్తం లేదా మీ పొదుపు ఖాతాలో నుండి మీ ‘కిస్తీ' ని (కాంట్రిబ్యూషను) తీసుకునే అధికారాన్ని బ్యాంకుకు కల్పించాలి.
  • ఈ ఖాతాలో కాంట్రిబ్యూషనుకు కావలసిన మొత్తం లేనట్లయితే ఆ తరువాత అపరాధ రుసుముతో కలిపి బ్యాంకు వసూలు చేస్తుంది.
  • ఖాతాలో కాంట్రిబ్యూషన్ వసూలు చేయడానికి 24 నెలల సమయం బ్యాంకు మనకు ఇస్తుంది.
  • గడువు ముగిసేలోపు మనం కాంట్రిబ్యూషనుకు కావలసిన మొత్తాన్ని డిపాజిట్ చేయలేకపోయినట్లయితే ఖాతాను బ్యాంకు మూసివేస్తుంది.
  • ఖాతాదారుడు పాలసీ తీసుకునేటప్పుడు ఫారంలో తప్పనిసరిగా నామినీ పేరును ప్రతిపాదించాలి. పాలసీదారుడు మరణిస్తే పింఛను జీవితభాగస్వామికి ఇస్తారు. ఇద్దరూ లేకపోయినట్లయితే పింఛను నిధిని నామినీకి ఇస్తారు.

| అటల్ పెన్షన్ యోజన ద్వార ఉపయోగాలు

  • 60 సంవత్సరాల వయస్సు నుండి మీరు, మీ మరణం తరువాత మీ జీవిత భాగస్వామి
  • ప్రతి నెలా నిర్దిష్టమైన పెన్షన్ పొందుతారు. మీ జీవిత భాగస్వామి తరువాత మీ నామినీ రూ.1,70,000/- ల నుండి 8,50,000/- ల వరకు పొందుతారు.
  •  కనీస పెన్షన్ ప్రయోజనానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.
  • నెలవారి చెల్లించవలసిన సొమ్ము లబ్ధిదారుని వయస్సు మరియు ఎంచుకున్న పెన్షన్ సొమ్ముపై ఆధారపడి ఉంటుంది.
  • కంట్రిబ్యూషన్ సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుండి బ్యాంక్ ద్వారా 'ఆటో డెబిట్' సదుపాయం ద్వారా తీసుకోబడుతుంది.
  • 31 డిసెంబరు 2015 కి లోపల ఈ పథకంలో చేరితే, మొత్తం సహాయంలో కేంద్ర ప్రభుత్వం 50% లేదా ప్రతి ఏటా రూ. 1,000/- లు, ఏది తక్కువైతే అది. ఈ సహాయం అర్హులైన ఖాతాదారులందరికీ 5 సంవత్సరాల పాటు చెల్లిస్తుంది.
  • ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు.