సెప్టెంబర్ 27, 2023న, పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) 2023 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లను డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ https://tstet.cgg.gov.in/. లో యాక్సెస్ చేయగలరు. ఫలితాన్ని తనిఖీ చేయడానికి, వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్ వంటి ఆధారాలను అందించాలి.
సెప్టెంబర్ 15న పరీక్షను నిర్వహించగా పేపర్ -1కు 2.26 లక్షల మంది, పేపర్ -2కు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1 అర్హత సాధించిన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్టీజీ పోస్టులకు అర్హులు. కాగా పేపర్ -2 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల కాగా నవంబర్ 20 నుంచి 30 వరకు టీఆర్టీ పరీక్ష జరగనుంది
Direct link for Results with only Hall ticket Number